జనసేన పార్లమెంట్ కమిటీలో చోటు దక్కని గద్వాల్ జిల్లామెగా అభిమానుల అధ్యక్షుడు

  గద్వాల్ జిల్లా మెగాభిమానుల అధ్యక్షుడు అయిన జమ్మన్న జనసేన పార్టీ స్థాపించిన నాటినుంచి పవన్ కళ్యాణ్ గారి పిలువు మేరకు, విస్తృతంగా పార్టీ కార్య కలాపాలను తన స్వంత ఖర్చులతో నిర్వహించి, గద్వాల్ లో పార్టీ విస్తరణకు కృషి చేస్తున్నాడు.

జమ్మన్న సాధారణ భవన కార్మిక సభ్యుడు, ఇప్పటివరకు తన స్వంత ఖర్చులతో సభ్యత్వం 6000 పూర్తిచేసినారు, పార్లమెంట్ ఎన్నికల నాటికి 20000 మంది సభ్యత్వం చేర్పించే లక్ష్యముతో పని చేస్తున్నాడు, ఇటీవల పార్లమెంటరీ కమిటీలో చురుకుగా పనిచేసే జమ్మన్నకు చోటు దక్కలేదు,

చోటు దక్కక పోవడంతో జమ్మన్న తీవ్ర నిరాశకు లోను అయ్యి, తెలంగాణ జనసేన ఇంచార్జి శంకర్ గౌడ్ కి విన్నవించుకుందా మంటే స్పందించడం లేదు, జిల్లా లో కీలక వ్యక్తి కె ఇలాజరిగితే శంకర్ గౌడ్ గారు స్పందించకుండా ఉండటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై అయ్యి పార్టీ విడిచి పెట్టడానికి నిర్ణయించుకున్నారు. పదవి దక్కగా పోగా అసమర్థులకు గద్వాల్ నుంచి చోటు దక్కడం జమ్మన్న ను తీవ్రముగా నిరాశపరిచింది, ఇప్పుడే పురుడు పోసుకున్న పార్టీలో ఇటువంటివి మంచి పరిణామము కాదు అని గద్వాల్ జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు, కాబట్టి అధినాయకత్వం ఇప్పటికైనా జమ్మన్న విషయములో అధినాయకత్వం న్యాయం చేయాలని గద్వాల్ మెగాభిమానులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *