జనసేన పార్టీలో చేరిన జి.హొసళ్ళి గ్రామస్థులు

రాజకీయాల్లోకి వచ్చి కోట్ల రూపాయల ధనం వెచ్చించడం కాదు,ఆపదలో నున్న ప్రజల సమస్యలను తీర్చడం రాజకీయ నాయకుడి లక్ష్యమని జనసేన నాయకుడు ఎన్.మల్లికార్జున( మల్లప్ప) అన్నారు ఆదివారం మండల పరిధిలోని జి.హొసళ్ళి గ్రామానికి చెందిన మల్లికార్జున,నబీసాబ్,రామకృష్ణ నేతృత్వంలో సుమారు 50 మంది జనసేనలో చేరారు.మల్లప్ప కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మల్లప్ప మాట్లాడుతూ రాజకీయాలు మార్చడానికి ప్రజలు స్వచ్చందంగా  జనసేనలో చేరడం అభినందనీయమన్నారు.గత 25 ఏళ్లుగా పట్టణంలోని మిల్లులు మూతపడడానికి కారణం ఇప్పటివరకు పాలించిన నాయకులే కారణ మన్నారు.
 
వర్షభావం లేక రైతులు వలసలు వెళుతున్న నివారించి, సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.ఉపాధి లో పనిచేసిన సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్నారు.అధికార,ప్రతిపక్ష నాయకులు  గ్రామంలో ఉండే ప్రజలను విస్మరిస్తున్నారన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజలపట్ల చిత్తశుద్ధి ఉందని,పేద ప్రజల జీవితాలను సాకారం చేయడమే ఆయన అజెండానన్నారు.ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గా నన్ను గెలిపిస్తే త్రాగునీరు, సాగునీరు,పేదలకు ఇళ్ళు,రోడ్లు,డ్రైనేజ్ వేయించే బాధ్యత నాది అన్నారు.అభిమానం వేరు,జీవితం వేరు కాబట్టి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. నెల,రెండు నెలలకోసారి ప్రతి గ్రామాన్ని పర్యటించి అక్కడ తిష్టవేసిన సమస్యలపై పరిష్కరించే దిశగా కృషిచేస్తానన్నారు. చంద్రబాబు పెంపుదల చేసిన పెన్షన్ పథకం కేవలం రెండు నెలల పథకమే అని సూచించారు.అధికారం లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాల్సిన బాధ్యత లేదా అని వైసిపి పార్టీ ని ప్రశ్నించారు.25 ఏళ్లుగా ప్రజలను మభ్యపెట్టిన నాయకులకు స్వస్తి పలుకుదామన్నారు. అవినీతి నిర్మూలన,పేదప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ జనసేన, అధికారంలో రాగానే మేనిఫెస్టోని అమలుచేస్తామన్నారు.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ మేళాలు పెట్టి కల్పిస్తామని పేర్కొన్నారు.వికాస్, వెంకటేష్,చంద్ర,రవి‌,శ్రీనివాసులు, బీరప్ప,శివరాజ్, మారెన్న,హనుమంతు,రామాంజిని‌,మరియు మరో 40మంది పార్టీలో చేరారు.కార్యక్రమంలో జనసేన సైనికులు అనంత్,చంద్ర రెడ్డి,విశాల్,బసవ తదితరులు పాల్గొన్నారు.
 
  పార్టీలో చేరిన జీ.హొసళ్ళి గ్రామస్థులతో మల్లప్పన్న:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *