ప్రముఖ నటి శారదకు తమిళనాడు ప్రభుత్వం పురస్కారం ఇచ్చింది

అలనాటి మేటి నటి ఊర్వశి శారద పరిచయం అవసరం లేని వ్యక్తి. నటిగా ఆమెకి ఉన్న గుర్తింపు అలాంటిది. ఆమె సినిమాలు ఎన్నో. ఎటువంటి పాత్రని ఐన ఎంతో అలవోకగా చేయగల ప్రతిభ ఆమె సొంతం.అందం అభినయం చాకచక్యం ఆమెకు ఆలంకారాలు.*ఎందరో గొప్ప నటులతో నటించిన అనుభవం ఆమె కు ఉంది. ముఖ్యంగా శోభన్ బాబు గారితో ఎన్నో హిట్ సినిమాలు చేసారు.  చక్కటి కుటుంభ కథా చిత్రాలు చేయడం లో ఆమెకు ఆమె సాటి. తెలుగు మరియు మలయాళ సినీ రంగంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది.  శారాధమ్మ ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు ఫిలిం ఫేర్ మరియు నంది పురస్కారాలు సంపాదించుకున్నారు. అంత గొప్ప నటి ని తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు తో పురస్కరించడం ఎంతో హర్షించ దగిన విషయం. ఎందరో నేటి తరం హీరోయిన్లకు ఈ పురస్కారం కొన్నేళ్ల క్రితమే దక్కింది. కళామ్మ తల్లి కి సేవలు చేసే ఎందరో అలనాటి తారాలను మనం ఇంత ఆలస్యంగా గౌరవిస్తునందుకు కాస్తంత బాధ గానే ఉన్న తమిళనాట మన పెద్దలకు గుర్తింపు లభించడం ఆనందం కలిగిస్తుంది. శారాధమ్మ కు కలైమామణి గౌరవం దక్కినందుకుగాను  telugodu.co హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *